00:00/00:00
随时随地任意搜索并下载全网无损歌曲
扫描右侧二维码下载歌曲到手机
免费获取更多无损音乐下载链接
文本歌词
璐璐 - Nee Jathaga
Lyrics by:Sirivennela Sitarama Sastry
Composed by:Devi Sri Prasad
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్ధం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
కల్లోకొస్తావనుకున్నా
తెల్లార్లు చూస్తూ కుర్చున్నా
రాలేదే జాడైన లేదే
రెప్పల బయటే నేనున్నా
అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే పైగా తిడతావే
లోకంలో లేనట్టే
మైకంలో నేనుంటే
వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటే
ఇంకేదో ఉందంటే
నమ్మే మాటలా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
తెలిసీ తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపూ ఏంచేస్తావ్ చెప్పు
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతోంది
నీ వైపూ నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ
ఏవేవో అనుకుంటూ
విడిగ ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ
దూరాన్నే తరిమేస్తూ
ఒకటవ్వాలిగా
నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి